* మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
ఆకేరున్యూస్, హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు, అనారోగ్యం, ప్రమాదాల బారినపడి పనిచేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయ కార్యక్రమం మే 9న మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరుగనుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి చెక్కులను అందచేస్తారని తెలంగాణ విూడియా అకాడవిూ చైర్మన్, కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇటీవల మరణించిన 38 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఐదు సంవత్సరాల వరకు, ప్రతి కుటుంబానికి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు చదివే ఇద్దరు పిల్లలకు నెలకు రూ.2000 ట్యూషన్ ఫీజు, జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి మంజూరు చేసినట్లు అకాడవిూ చైర్మన్ వెల్లడిరచారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, ప్రమాదానికి గురై భృతిని కోల్పోయిన జర్నలిస్టులు, ఇతర వ్యాధులకు గురైన వారికి లక్ష రూపాయల చొప్పున, మొత్తం ఎనిమిది మందికి ఆర్థికసాయం మంజూరు చేశామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడిరచారు. ఈ సందర్బంగా, విూడియా. అకాడవిూ వెబ్‌సైట్‌ను, జర్నలిస్ట్‌ల పునశ్చరణ తరగతుల నిర్వహణకు అకాడవిూ ప్రచురించిన వివిధ అంశాలతో కూడిన చిరు పుస్తకాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు.
………………………………….
