* రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కొహ్లి
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : టెస్ట్ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లి ప్రకటించారు. ఈమేరకు ఇన్ స్టాలో భావోద్వేగత పూరితంగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో కోహ్లి క్రికెట్ గమనంలో కొన్ని ముఖ్య అంశాలను ప్రస్తావించాల్సి వస్తే.. ఆయన 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యారు. ఆయన 15 జనవరి 2022న టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లి మొదటిసారి ప్రాచుర్యం పొందారు. మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో విజయాన్ని సాధించిన భారత జట్టుకి కోహ్లి సారథ్యం వహించారు. 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో ఇండియా విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. 2008 లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో వంద పరుగులు సాధించిన తర్వాత, జట్టుకు ఎంపికయ్యారు. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్‌లో కోహ్లి మొదటిసారి వన్ డే ఇంటర్ నేషనల్స్ లో అడుగుపెట్టారు. డిసెంబరు 2009 లో శ్రీలంక భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు నాలుగవ ODI లో ఆడటానికి కోహ్లికి అవకాశం వచ్చింది. గౌతమ్ గంభీర్‌తో కలిసి సింగిల్స్ తీస్తూ అతను తన మొదటి ODI శతకాన్ని సాధించాడు. మూడవ వికెట్ కి వారు 224-పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఆ మ్యాచ్ లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి 3–1 స్కోరుతో ఆ సీరీస్ ని కైవసం చేసుకుంది. ఆ సీరీస్ లో అతని ప్రదర్శనకు గౌతమ్ గంభీర్ తన మాన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లికి ఇచ్చాడు.
ఊహించని షాక్
2011 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడిన ప్రారంభ మ్యాచ్ లో కోహ్లి వంద పరుగులు (సెంచరీ) చేసి మొదటి ఆటలోనే వంద పరుగులు చేసిన క్రికెటర్ గా గుర్తింపు పొందారు. జనవరి 12, 2022న జరిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహ్మద్ షమి వేసిన 56వ ఓవర్ రెండో బంతికి తెంబా బవుమా ఇచ్చిన ఔట్‌సైడ్ ఎడ్జ్ క్యాచ్‌ను ఎంతో చాకచక్యంగా క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకి టెస్టుల్లో వందో క్యాచ్‌గా నమోదైంది. ఇప్పుడు కోహ్లి, రోహిత్ శర్మ లేకుండానే ఇక టీం ఇండియా టెస్ట్ లను ఆడబోతుంది. టెస్ట్ లకు భారత కెప్టెన్ గా శుభమన్ గిల్, వైఎస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరిస్తారని, బీసీసీఐ నుంచి ప్రకటన అధికారికంగా వస్తుందని అనుకున్న సమయంలో విరాట్ కోహ్లి ఈ టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించడం భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ అని చెప్పాలి.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
