Farmer Injured Bull Attack
* సూక్య తండాలో విషాదం.. కడుపులో నుంచి బయటకొచ్చిన పేగులు
ఆకేరు న్యూస్,రాయపర్తి:
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఓ పేద రైతుపై ఎద్దు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, జయరామ్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సూక్య తండాలో చోటుచేసుకుంది.
* కథనం వివరాల్లోకి వెళ్తే
సూక్య తండాకు చెందిన గూగులోతు మానునాయక్ అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద వరి నాటు వేయడానికి పొలం దున్నడం కోసం పొలంలో ఎడ్లను కట్టి పొలం దున్ని గొర్రు తోలాడు. పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం వేళ ఎడ్లను ఇంటికి తీసుకొచ్చి కట్టేశాడు. మరసటి రోజు ఉదయాన్నే మళ్లీ పొలం పనుల కోసం ఎడ్లను విప్పుతుండగా, ఒక్కసారిగా ఒక ఎద్దు విరుచుకుపడింది.ఎద్దు తన పదునైన కొమ్ములతో మానునాయక్ కడుపులో బలంగా పొడవడంతో ఆయన విలవిలలాడిపోయాడు. దాడి తీవ్రతకు కడుపులోని పేగులు ఒక్కసారిగా బయటకు వచ్చేశాయి. రైతు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షించారు.
రైతు పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ, మెరుగైన వైద్యం కోసం వరంగల్ M G M ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ హఠాత్తు సంఘటనతో సూక్య తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
