* క్యూలో ఉన్న ఇద్దరు వృద్ధులు మృతి
ఆకేరు న్యూస్, చెన్నై : తొలి దశ పోలింగ్ జరుగుతున్న వేళ తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న వారిలో ఇద్దరు వృద్ధులు కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వడదెబ్బకే మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీలం మండలం కెంగపల్లి సెందరపట్ట పంచాయితీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఓటు వేసిన అతి పొట్టి మహిళ
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ రికార్డుకెక్కిన జ్యోతి ఆమ్గే మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. జ్యోతి ఆమ్గే పొడవు జస్ట్ 62.8 సెంటీమీటర్లు మాత్రమే అంటే రెండు ఫీట్లా 6 ఇంచులు అన్నమాట. రెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లాడి ఎత్తు కంటే కూడా తక్కువ. బిగ్ బాస్ అమెరికన్ హార్రర్ స్టోరీ లాంటి టీవీ షోల్లో జ్యోతి పాల్గొన్నారు. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు త్రిపురలో అత్యధికంగా 53 శాతం, అత్యల్పంగా త్రిపురంలో 23 శాతం, తమిళనాడులో 39.51, లక్షదీప్ లో 29.1, రాజస్థాన్ లో 30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
మణిపూర్ పోలింగ్ బూత్ సమీపంలో కాల్పులు
లోకసభ ఎన్నికల పోలింగ్ వేళ మణిపూర్ లోని మోయిరాంగ్ లో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. థమన్ పోక్సీలోని పోలింగ్ బూత్ సమీపంలో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు జరిగాయి . గన్ ఫైరింగ్ పెద్ద ఎత్తున జరగడంతో అక్కడున్న ఓటర్లు భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఇంఫాల్ ఈస్ట్ లోని కోహోంగ్మాన్ జోన్ 3లో ఆందోళనకారులు EVM మెషిన్ ను ధ్వసం చేశారు .
—————————————–