మహబూబ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
* నువ్ కాంగ్రెస్ వైపు చూస్తే.. నీ సంగతేంటో చూస్తా
* బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు రేవంత్ రెడ్డి హెచ్చరిక
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ :
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లిల్లీఫుట్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నువ్వు మా కాంగ్రెస్ వైపు చూస్తే.. నీ సంగతేంటో చూస్తా. రేవంత్ ను ముట్టకుంటే షాక్ కొడతాడు. నేను హైటెన్షన్ వైరులాంటోడిని. మా ఎమ్మెల్యేలను ముట్టుకోచూద్దాం. వారిని కాపాడుకునే శక్తి నాకుంది. కరెంట్ తీగను తాకితే కాకి ఎలా మాడిపోతుందో.. నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి అలా ఉంటుంది. ’’ అంటూ కేసీఆర్ ను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ పథకాలకు కాలం చెల్లిందన్నారు. పాలుమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని, ఈ గడ్డ అభివృద్ధి చెందాలంటే తమకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
