* మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన
* చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు
ఆకేరు న్యూస్, డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) లోని అగ్నిప్రమాదంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చార్మినార్ (Charminar) సమీపంలోని గుల్జార్ హౌస్ (Guljar house) లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
