* రోగుల సమస్యలు, హాస్పిటల్లో వైద్య సేవలు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై సర్వే
ఆకేరున్యూస్, వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్‌లో రోగులకు సరైన వైద్య సేవలు, నిర్వహణ లోపాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం హాస్పిటల్‌ను సందర్శాంచారు. ఈ సందర్భంగా రోగులను సమస్యలను అడిగి తెలుసుకోవడం, హాస్పటల్లో వైద్య సేవల నాణ్యత మేజర్ ఆపరేషన్లు అందుబాటు, మరియు ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఇటీవల దినపత్రికలలో, టీవీ ఛానల్లో ఈ హాస్పిటల్లో సరైన వైద్యం సేవలు అందడం లేదని మేజర్ ఆపరేషన్లను నిర్వహించడం లేదని ఔట్సోర్సింగ్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాల్లో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిపిఐ బృందం హాస్పిటల్‌ను సందర్శించి రోగులు మరియు సిబ్బందితో చర్చించి సమస్యలు గుర్తించారు. ఈ విషయాలను సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ డిప్యూటీ సూపరిెంటెండెంట్ బాలరాజును, ఆర్ఎంఓ దీపక్ రెడ్డిని వివరణ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేజర్ ఆపరేషన్లు జరగకపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో సెంట్రల్ ఏసీ లేకపోవడం మరియు ఇతర పరికరాలు అందుబాటులో లేకపోవడం కొంత లోపం జరిగిందని.. పై అధికారులకు కూడా తెలియజేశామని తెలిపారు. వారం రోజులలో సిపిఐ పార్టీ అందజేసిన సమస్యలపై సంపూర్ణ నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీిఐ బృందం మద్దేల ఎల్లేష్, వేల్పుల సారంగపాణి మాట్లాడుతూ సెంట్రల్ ఏ.సి, ఆధునిక పరికరాల సమకూర్చుతో మేజర్ ఆపరేషన్లు తక్షణమే ప్రారంభించాలని.. అదేవిధంగా కార్మికుల సమస్యలు ఔట్సోర్సింగ్ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ మరియు కనీస వేతనాలు సకాలంలో చెల్లించాలని పారదర్శక మరియు జవాబుతనం హాస్పటల్లో రోగుల ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేయడానికి వెనుకాడేది లేదని అధికారులను డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు, మద్దెల ఎలేష్, వేల్పుల సారంగపాణి, మునిగాల బిక్షపతి, చెక్కు రాజు గౌడ్, శనిగరపు రాజకుమార్, కండె నరసయ్య, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
…………………………………
