* విమాన ప్రమాద ఘటనపై ఎన్ ఐఏ దర్యాప్తు
* ఎన్ ఐఏ పరిశీలనలో మరో మృతదేహం గుర్తింపు
* విచారణ పూర్తయ్యే వరకు శకలాలు తొలగించవద్దని అధికారులకు సూచన
ఆకేరు న్యూస్, డెస్క్ : అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Air India Flight Crash)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) విచారణ చేపడుతోంది. ఈ ఘటనలో విద్రోహ కోణం ఉందా అనే అనుమానంతో కూడా దర్యాప్తు చేపడుతోంది. ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో ఎన్ ఐఏ(nia) పరిశీలనలో మరో మృతదేహం బయటపడింది. డెడ్ బాడీ ని అక్కడ నుంచి తరలించారు. డీజీసీఏ(dgca)తో పాటు పలు దర్యాప్తు సంస్థలు విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్నాయి. సహాయక చర్యలకు భారీ క్రేన్లను అధికారులను తెప్పించగా, విచారణ పూర్తయ్యే వరకు శకలాలు తొలగించవద్దని డీజీసీఏ ఆదేశించింది. దీంతో అధికారులు పనులను నిలిపివేశారు. విమానం తొలుత తాకిన, మొత్తం కుప్పకూలిన ప్రాంతాలను డీజీసీఏ, ఎన్ ఐఏ సంస్థలు సందర్శించాయి. ప్రమాదానికి సాంకేతిక లోపాలు కారణమా.. లేదా ఉగ్ర కోణం ఉందా? కావాలని చేసిన ప్రమాదమా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాయి.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
