* బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం
* బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఆలయ అధికారులు
* వచ్చిన వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖేష్ అంబానీ సతీమణి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ భారీ విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆలయ అధికారులు విరాళాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీతో ప్రతిరోజు భక్తులకు నిత్యాన్నదానం చేయనున్నారు. నీతా అంబానీ సమయం దొరికినప్పుడు దేశంలో ఉన్న ఆలయాలను సందర్శిస్తుంటారు. హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చినా ఆమె ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. ఎల్లమ్మ అమ్మ వారిపై నీతా అంబానీకి విశ్వాసం ఉంది. ఈ నేపధ్యంలో ఆమె ఆలయానికి భారీ మొత్తం విరాళంగా ఇచ్చారు.ఇదిలా ఉండగా ఆశాడంలో జరిగే బోనాల కోసం బల్కంపేట ఆలయం ముస్తాబవుతోంది.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
