– జనగామ సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
ఆకేరు న్యూస్, జనగామ: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ సి విక్రమ్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ నల్సా (NALSA) డి ఏ డబ్ల్యూ ఎన్(DAWN) డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్ 2025 పై అవగాహన సదస్సు గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులకు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి ,సీనియర్ సివిల్ జడ్జ్ విక్రమ్ మాట్లాడుతూ మారక ద్రవ్యాలు ఎలా తయారవుతాయి అవి మనుషులపై ఎలా ప్రభావం చూపుతాయి వాటికి యువత ఎలా బానిసలు అవుతారో వివరించారు. మరక ద్రవ్యాలు అమ్మేవారు చిన్నపిల్లలను ఎలా టార్గెట్ చేస్తున్నారో, వారిని ఏ విధంగా బానిసలను చేస్తున్నారు అనే విషయాలపై విపులంగా విద్యార్థులకు వివరించడం జరిగినది. అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదు. ఏ విధములైన తినే వస్తువులను తీసుకోరాదు .ఎవరిని నమ్మవద్దు అన్నారు. మారకద్రవ్యాలు చాక్లెట్స్ రూపంలో గానీ, స్టిక్కర్స్ రూపంలో గానీ ఏ రూపంలోనైనా ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. సెల్ ఫోన్ లను వాడవద్దని అన్నారు. ఇంటర్నెట్ వాడకము ఈ వయసులో వాడరాదు అన్నారు . అపరిచితుల బండ్లపై లిఫ్ట్ ఇస్తాను అంటే వెళ్ళవద్దు అన్నారు. బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు .చెప్పిన మాటలు విని వారితో వెళ్ళవద్దు అన్నారు కిడ్నాప్ అయ్యే ప్రమాదం ఉంది అన్నారు. ఇక్కడ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి మీ ఫ్రెండ్స్ కి బయట అందరికీ మీరు కూడా తెలియజేయండి అలా తెలియజేయడం వల్లే మారకద్రవ్యాల వినియోగము తగ్గుతుంది అన్నారు. డ్రగ్స్ కొనేవాళ్లు లేకపోతే అమ్మే వాళ్ళు ఉండరు అప్పుడే డ్రగ్స్ వాడకం లేని దేశము అవుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ విక్రమ్ తో పాటు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ వి కృష్ణమూర్తి, ఆ స్కూల్ టీచర్లు ఎండి అప్సర్, ఎన్ కనకయ్య, పి ఎల్ వి(PLV)శేఖర్ పాల్గొన్నారు.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
