* దీనికి సాక్ష్యాలు ఉన్నాయి
* సాక్షాధారాలతోనే బాధితులు కేస్ పెట్టారు
* కౌషిక్ రెడ్డికి నైతిక విలువలు లేవు
* బ్లాక్ మెయిల్ చేయడం కౌశిక్ నైజం
* పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆకేరు న్యూస్,, హనుమకొండ ః పూర్తి సాక్షాధారాలతోనే బాధఙతులు కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఎన్నికల మందు కూడా మనోజ్ రెడ్డి వద్ద 20 లక్షాలు వసూలు చేశాడని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు 50 లక్షల ఇవ్వమని డిమాండ్ చేశాడని రేవూరి తెలిపారు.కౌశిక్ రెడ్డికి ఉన్న అధికార బలం చూసి ఆయన పై ఫిర్యాదు చేయడానికి బాధితులు భయపడ్డారని రేవూరి అన్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్లో ఏం జరుగుతుందోననే భయంతో బాధితులు తమను కౌశిక్ రెడ్డి నుండి కాపాడాలని ఫిర్యాదు చేశారని రేవూరి అన్నారు.కౌశిక్ రెడ్డిది బ్లాక్ మెయిల్ చరిత్రన్నారు. ఎన్నికల్లో ప్రజల్లో ఓటేయకపోతే చనిపోతామని భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని గెలిచాడని రేవూరి అన్నారు.ఆయన నైజం ప్రమాదకరమని అన్నారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే బీఆర్ ఎస్ నాయకులు కేసీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవూరి అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి క్షమించకూడదని ఆయనకు మద్దతు తెలుపుతున్న వారిని కూడా క్షమించకూడదు అని కోరారు. ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని కాంగ్రెస్ పార్టీకి చట్టంపై గౌరవం నమ్మకం ఉందన్నారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
