Love and War
Love and War| ఆకేరు న్యూస్, డెస్క్: బాలీవుడ్లో భారీ అంచనాలున్న ‘లవ్ అండ్ వార్’ సినిమాకు సంబంధించి కీలకమైన బిజినెస్ డీల్ జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘లవ్ అండ్ వార్’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను పెన్ మరుధర్ సంస్థ సుమారు రూ.300 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ హక్కుల కోసం పలు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడగా.. అత్యధిక మొత్తానికి బిడ్ చేసిన పెన్ మరుధర్ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
2027లో రిలీజ్
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాను అదే స్థాయిలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
దీపావళికి టీజర్?
సినిమాపై ఆసక్తిని మరింత పెంచేందుకు దీపావళి సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రామాయణ’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో ‘లవ్ అండ్ వార్’ టీజర్‌ను ప్రదర్శించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
