Matwada
Matwada| ఆకేరు న్యూస్, వరంగల్: మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగంపేటలో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో మద్యం, బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. రంగంపేటలోని బద్రకాళి మాత ఆలయం సమీపంలో ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ తనిఖీలు చేపట్టిన పోలీసులు చింత అనిల్ కుమార్ (53)ను అదుపులోకి తీసుకున్నారు.
దుకాణంలో తనిఖీ చేయగా ఆఫీసర్స్ ఛాయిస్, ఇంపీరియల్ బ్లూ, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, డౌన్ టౌన్, మెక్‌డోవెల్స్ తదితర బ్రాండ్ల మద్యం బాటిళ్లు లభించాయి. వీటితో పాటు కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం, బీర్ విలువ సుమారు రూ.25,810గా పోలీసులు వెల్లడించారు.
అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న మద్యం, బీర్‌ను తదుపరి చట్టపరమైన చర్యల కోసం మట్వాడ పోలీసులకు అప్పగించారు. అనిల్ కుమార్ రంగంపేటలోని బద్రకాళి మాత ఆలయం సమీపంలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, ఎస్ఐ బి. ఉప్పలయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
