Rana Daggubati
Rana Daggubati| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన డోరోతీ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కీర్తి సురేశ్, సనత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నారు.
* టైటిల్ వెనుక అర్థం
హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డోరోతీ టైటిల్‌పై రానా దగ్గుబాటి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డోరోతీ అనే పదానికి దేవుడిచ్చిన కానుక అనే అర్థం ఉందని తెలిపారు. సినిమాలోని ఓ పాత్ర పేరు కూడా డోరోతీ అని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఈ పేరే ఎందుకు పెట్టారో ప్రేక్షకులకు అర్థమవుతుందని రానా పేర్కొన్నారు.
* భావోద్వేగాలకు భాష లేదు
తమిళ చిత్రాలను తెలుగులోకి తీసుకొచ్చే సమయంలో ఒరిజినల్ టైటిల్స్‌ను కొనసాగించడంపై రానా స్పందించారు. మనిషి నవ్వు, ఏడుపు, బాధ వంటి భావోద్వేగాలకు ప్రత్యేకమైన భాష ఉండదని ఆయన అన్నారు. భాషలకు అతీతంగా భావోద్వేగాలు అందరికీ అర్థమవుతాయని పేర్కొన్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన డోరోతీ కి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సెప్టెంబర్‌లో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
