
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్(Law Cet), పీజీ లాసెట్ (Pg Lawcet) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈనెల 6న నిర్వహించిన ఈ పరీక్ష ప్రాథమిక కీని 11వ తేదీన విడుదల చేశారు. 13 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. రేపు ఫైనల్ కీ(Final Key)తో పాటు, ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే, అఫీషియల్ వెబ్ సైట్లో ఫలితాలను ఉంచనున్నారు.
……………………………………………