G2 Movie Release Date
* 2027 ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్ రిలీజ్..
* ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ
ఆకేరు న్యూస్, సినిమా : అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ జీ2 రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. బ్లాక్‌బస్టర్ గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా 2027 ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
* అంతర్జాతీయ స్థాయిలో స్పై యాక్షన్..
గూఢచారి విజయాన్ని బేస్‌గా చేసుకుని జీ2ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్, స్పై అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. దర్శకుడిగా వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.
* జెంట్ 116గా వామికా గబ్బి
ఈ సినిమాలో వామికా గబ్బి ఏజెంట్ 116గా కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు ఎమోషన్ ఉన్న పాత్రలో ఆమె నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇమ్రాన్ హష్మీ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా.. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో జీ2 విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
