* వరంగల్ పార్టీలో రచ్చపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని గాంధీభవన్(Gandibhavan)లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఛైర్మన్ మల్లురవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ హాజరయ్యారు. ఇంతకుముందు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి ఉండేవారు. ఆయన నుంచి ఆ బాధ్యతలను ఎంపీ మల్లురవికి అప్పగించారు. సమావేశంలో వరంగల్(Warangal) కాంగ్రెస్ లో జరుగుతున్న రచ్చ చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) దంపతులపై సీనియర్ నేతలు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై గతంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేసింది. కులగణనలో బీసీల లెక్కను తగ్గించి ఓసీ సంఖ్యను పెంచి తప్పుగా చూపించారని, ప్రభుత్వం విడుదల చేసిన కులగణన రిపోర్టును ఆయన బహిరంగంగా తగులబెట్టడాన్ని సీరియస్ గా పరిగణించి చర్యలు చేపట్టింది. మరి కొండా దంపతుల వ్యవహారశైలితో పార్టీకి నష్టం కలుగుతోందని సీనియర్ నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సురేఖపై ఎటువంటి చర్యలు ఉంటాయో అన్నది వేచి చూడాలి.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
