
ఆకేరు న్యూస్ హనుమకొండః వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో వినియోగించకుండా ఉన్న పాత వస్తువులను జులై 7 వ తేదీన వేలం వేయ నున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 7 తేదీన మామునూరు లోని పోలీస్ శిక్షణ కళాశాలలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్ కార్డుతో వేలం పాటకు హాజరుకావాలని కోరారు. ఎలక్ట్రిక్ వప్తువులు,ఎలక్ట్రానిక్ వస్తువులు,పాత ఇనుమ సామానులు, టెంట్లు ప్లాస్టిక్ వస్తువులు మొదలైన వాటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు.వివరాల కోసం ఆర్ ఐ మహేష్‌ని 8712597562..9640333445 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
……………………………………………………