
* భద్రాద్రి రాముడి భూములపై వివాదం
* స్పృహతప్పిన పడిపోయిన ఈవో రమాదేవి
ఆకేరు న్యూస్, భద్రాచలం : రాముల వారి ఆలయ భూముల (Bhadradri temple lands) విషయంలో తలెత్తిన వివాదంలో భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. అల్లూరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామస్థులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులతో వెళ్లిన ఆమెతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. అనంతరం కొందరు దాడి చేయడంతో తొక్కిసలాటలో ఈవో (EO) స్పృహ తప్పిపడిపోయారు. దీంతో అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు (AP High Court) ఇటీవల ఆదేశించింది. ఈక్రమంలో అధికారులు అక్కడకు వెళ్లగా ఉద్రిక్తత ఏర్పడింది. పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను గతంలో కూడా ఆలయ ఈవో, అధికారులు అడ్డుకున్నారు. అప్పుడు కూడా వీరిపై ఆక్రమణదారులు కర్రలతో దాడులు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలయ భూముల్లో ఆక్రమణదారులు అక్రమ కట్టడాలు కట్టడం వల్ల దేవస్థానానికి వచ్చే కూరగాయలు, ఇతరత్రా ఆదాయం కోల్పోవాల్సి వస్తోందని ఆలయ ఈవో చెబుతున్నారు.
………………………………………………………..