
* ఫర్నిచర్.. కంప్యూటర్లు ధ్వంసం
* ఆఫీస్ సిబ్బందిపై భౌతిక దాడి
* దాడిలో తీవ్రంగా గాయపడిన ఆఫీస్ సిబ్బంది
* ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః ఉప్పల్ లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యూ ట్యూబ్ కార్యాలయం క్యూ న్యూస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దాడికి పాల్పడినట్లు జాగృతి కార్యకర్తలు ప్రకటించారు. ఉప్పల్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన జాగృతి కార్యకర్తలు పెద్దపెద్ద కర్రలతో ఆఫీస్ లోని ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. కంప్యూటర్లను ధ్వంసం చేశారు. కార్యాలయ సిబ్బందిపై భౌతిక దాడి చేశారు. భౌతిక దాడిలో కార్యాలయ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదవుచేసేందుకు గన్మెన్ గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తూ ఆర్డినెన్సును తెస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో ఆర్డినెన్స్ పై జహీరాబాద్ లో కవిత స్పందించిన తీరుపై తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే కవితకు ఏం సంబందం బీసీల పేరుతో కవిత రాజకీయాలు చేస్తోందని తీన్మార్ మల్లన్న నిన్న జరిగిన సమావేశంలో కవితపై విమర్శలు చేశారు.బీసీలపై కవిత ప్రేమ ఒలకబోయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో కవితపై తీన్మార్ మల్లన్న మాట్లాడిన తీరుకు ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడిచేసి నానా భీబత్సం సృష్టించారు. కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడిచేసిన విషయాన్ని తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
………………………………………………