
Narendra modi visits Telangana
*వారికి ఇవే నా శుభాకాంక్షలు
*ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : నలుగురు ప్రముఖులు కొత్తగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వారు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (DROUPADI MURMU)వారిని ఎంపిక చేశారు. వారిలో ఉజ్వల్ దేవరావ్ నిగమ్(కసబ్ కేసు ప్రాసిక్యూటర్), సదానందన్ మాస్టర్(కేరళకు చెందిన సామాజిక కార్యకర్త), హర్షవర్ధన్ ష్రింగ్లా(మాజీ విదేశాంగ కార్యదర్శి), డా.మీనాక్షి జైన్ (రాజకీయ శాస్త్రవేత్త, చరిత్రకారులు) ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (NARENDRA MODI) వారికి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయ రంగం పట్ల, మన రాజ్యాంగం ఉజ్వల్ నికంకు ఉన్న అంకితభావం ఆదర్శప్రాయమైనదని, ఆయన విజయవంతమైన న్యాయవాది మాత్రమే కాదు.. ముఖ్యమైన కేసుల్లో న్యాయం కోరడంలో కూడా ముందంజలో ఉన్నారని అన్నారు. తన న్యాయవాద వృత్తి జీవితంలో, రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి మరియు సాధారణ పౌరులను ఎల్లప్పుడూ గౌరవంగా చూసుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేశారు. భారత రాష్ట్రపతి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉంది.. ఆయన పార్లమెంటరీ ఇన్నింగ్స్‌కు నా శుభాకాంక్షలు.. అని మోదీ ట్వీట్ చేశారు. ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగా సదానందన్ (SADANANDAN) మాస్టర్ చేసిన కృషిని ఈ సందర్భంగా మోదీ అభినందించారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేసుకున్నారు. ధైర్యానికి ఆయన ప్రతిరూపం అని చెప్పారు. దేశాభివృద్ధికి ఆయన కొనసాగిస్తున్న స్ఫూర్తిని బెదిరింపులు అడ్డుకోలేకపోయాయన్నారు. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దౌత్యవేత్త, మేధావి వ్యూహాత్మక ఆలోచనాపరుడిగా ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా (HARSHAVARDHAN) అంటూ మోదీ కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా దేశ విదేశాంగ విధానానికి కీలక సాయం అందించారు. ఆయన ప్రత్యేక దృక్పథాలు పార్లమెంటరీ కార్యకలాపాలను బాగా మెరుగుపరుస్తాయని చెప్పారు. విద్యావేత్తగా, పరిశోధకురాలుగా, చరిత్రకారిణిగా తనకు తానుగా డాక్టర్ మీనాక్షి జైన్ (MENAKSHI JAIN) ప్రత్యేకతను చాటుకున్నారని మోదీ. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజకీయ రంగాలలో ఆమె చేసిన కృషి విద్యారంగాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉందన్నారు.
……………………………………………..