
* అలనాటి అందాల నటి బీ. సరోజాదేవి కన్నుమూత
* ఎన్టీఆర్..ఏఎన్నార్..ఎమ్జీఆర్..శివాజీ గణేషన్ ల సరసన నటించిన బీ సరోజాదేవి
* తెలుగు ప్రేక్షకుల హృదమాల్లో చెరగని ముద్రవేసిన బీ. సరోజాదేవి
ఆకేరు న్యూస్ డెస్క్ ః అలనాటి అందాల నటి బీ సరోజాదేవి కన్నుమాశారు.గత కొంత కాలంగా అస్వస్థతో ఉన్న ఆమె బెంగళూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.తెలుగు,కన్నడ, మళయాల భాషల్లో నటించిన బీ సరోజ ఎన్టీర్ ఏఎన్నార్ ఎంజీఆర్ ,శివాజీ గణేషన్ లతో కలిసి నటించారు.శివాజి గణేషన్ కు జతగా ఆమె 22 సినిమాల్లో నటించారు బీ సరోజాదేవి మళయాలం సినిమా జీవితనౌకతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. పాండురంగ మహత్యం,పెళ్లికానుక,కృష్ణార్జున యుద్దం, జగదేక వీరుని కథ,దానవీర శూర కర్ణ లాంటి సినిమాల్లో నటించారు.ఐదు భాషల్లో 200 సినిమాలకు పైగా నటించారు. హిందీ రంగంలో కూడా తన అందచందాలతో ఆకట్టుకున్న బీ సరోజా ససురాల్..ఒపెరా హౌస్…హాంకాంగ్..ప్యార్ కియాతో డర్నా క్యా,,పరీక్ష చిత్రాల్లో నటించారు.
కన్నడంలో స్టార్‌గా వెలుగొందారు
కన్నడ చిత్ర సీమలో తొలి మహిళా సూపర్ స్టార్ అన్పించుకున్నారు. ఆమె నటించిన మహాకవి కాళిదాసు చిత్రంతో కర్ణాటకలో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రమే ఆమెను కన్నడ చిత్రసీమలో మహిళా సూపర్ స్టార్ ను చేసింది. 1955 నుంచి 1984 మధ్య కాలంలో ఆమె పలు చిత్రాల్లో ప్రధాన కథానాయికగా నటించారు. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలను ఆమె అందుకున్నారు. 1969 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించగా 1992లో ఆమెను పద్మభూషన్ పురస్కారంతో సన్మానించింది. బెంగళూరు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించగా తమిళనాడు నుండి కలైమామణి బిరుదు అందుకున్నారు.
అలనాటి అందాల తార
1960 దశకంలో బీ సరోజ అంటే అప్పటి యువతలో ఓ రకమైన క్రేజ్ ఉండేది. కుర్రకారు అమె అందానికి ఫిదా అయితే ఆడపిల్లలు ఆమె స్టైల్ ను అనుకరించేవారు. దాదాపు దక్షిణ భారత దేశంలో ఆ రోజుల్లో బీ సరోజ అంటే విపరీతమై క్రేజ్ ఉండేది. ఆమె కట్టుకున్న చీరలు, ఆమె హెయిర్ స్టైల్, అమె ధరించిన ఆభరణాలను ఆ రోజుల్లో మహిళలు అనుకరించేవారు. సినిమాల నుంచి విరమించుకున్నాక బీ సరోజదేవి బెంగళూరులో స్థిరపడ్డారు. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తన శేష జీవితం గడిపారు.
………………………………..