* ములుగు జిల్లా లో వెలసిన పోస్టర్లు
* వెంకటాపురం..వాజేడు మంలాల్లో ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ – తెలంగాణ పేరుతో వాల్ పోస్టర్లు
ఆకేరు న్యూస్ ,ములుగు: ములుగు జిల్లా లోని వాజేడు వెంకటాపూర్ మండలల లోని ప్రధాన కూడళ్లలో మావోయిస్టుల ఆత్మ రక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి.పోస్టర్ల లో ఈవిధంగా పొందుపర్శారు.సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి అశాకిరణం ఎన్నడైంది? మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మసంతృప్తిని మిగిల్చిందేంది.ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ 40 ఏండ్లనాటి ఉద్యమ బాట ప్రజాధరణ లేక మోడువారిన బీడు భూమిలాగా అయ్యింది.మావోయిస్టు అగ్ర నాయకుల్లారా ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి, కాలానుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కండి .అడవిని వీడి ప్రజల్లోకి రండి ప్రజాస్వామ్య గొంతుక కండి! ఆయుధాలు మనకొద్దు – ప్రజామోద మార్గమే మనకు ముద్దు ఆయుధాలు వీడండి- జనజీవన స్రవంతిలోకి రండి! మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి.అంటూ పత్రిక లు వెలిశాయి.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
