* రాచకొండ కమిషనరేట్ లో లొంగిపోయిన నిషేధిత CPI మావోయిస్ట్ పార్టీ నేతలు మాల సంజీవ్, అలియాస్ లెంగు దాదా,పార్వతి అలియాస్ దీనా
* ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు
* వారి పేరు మీద ఉన్న రివార్డులను వారికే ఇస్తాం ః సీపీ సుధీర్ బాబు
ఆకేరున్యూస్ హైదరాబాద్ : నిషేధిత CPI మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు రాచకొండ పోలీస్ కమీషనరేట్ లో సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. వీరిద్దరిపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది.మాల సంజీవ్ అలియాస్ లెంగు దాదా (DKSZC సెక్రటేరియట్ మెంబర్) గా ఉన్నారు .సంజీవ్ భార్య పార్వతి అలియాస్ దీనా (స్టేట్ కమిటీ మెంబర్) గా ఉన్నారు . మాల సంజీవ్ 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు .62 సంవత్సరాలు మాల సంజీవ్ సొంత ఊరు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యాప్రాల్ నివాసి…. 1980లో CPI (ML) పీపుల్స్ వార్లోని జన నాట్య మండలి (JNM)లో గద్దర్ నాయకత్వంలో చేరాడు. మాల సంజీవ్, గద్దర్ నాయకత్వంలోని JNM బృందంతో కలిసి ఇండియా లో సుమారు 16 రాష్ట్రాల్లో పర్యటించాడుCPI (ML) పీపుల్స్ వార్ గురించి ప్రచారం చేస్తూ, ప్రజలను ఆకర్షించడానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాడు. గతంలో గద్దర్‌కు ముఖ్య అనుచరుడిగా పనిచేశాడు.1982 లో కరీంనగర్ హుజారాబాద్ కి చెందిన పంజాల సరోజ అలియాస్ విద్య ను వివాహం చేసుకున్నాడు2002లో ములుగు జిల్లాలోని అయిలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో విద్య మరణించింది.1996లో మనుగూరు దళంలో చేరి డివిజన్ కమిటీ సభ్యుడిగా (DVCM) పనిచేశాడు. 2001లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా (SCM) పదోన్నతి పొంది ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ (NTSZC) పరిధిలో పనిచేశాడు. 2003లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి బదిలీ అయ్యి, CNM ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాడు.సంజీవ్, దీనా హిందీ, తెలుగు, స్థానిక కోయ భాషలు నేర్చుకుని గిరిజనుల్ని మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షించేవారు.పెరుగుల పార్వతి అలియాస్ దీనా (50 సంవత్సరాలు) స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా, పదర మండలం, వంకేశ్వరం గ్రామం నివాసి. దీనా రాష్ట్ర కమిటీ సభ్యురాలు (SCM in DKSZC), చైతన్య నాట్య మంచ్, DKSZC సాంస్కృతిక ఉప-సమితి సభ్యురాలు గా కొనసాగారు. 1992లో నల్లమల ప్రాంతంలో CPI (ML) పీపుల్స్ వార్ గ్రూపులోని అప్పర్ ప్లాట్యూ దళంలో చేరింది. 1998లో ఏరియా కమిటీ సభ్యురాలిగా (ACM) పదోన్నతి పొంది జన నాట్యమండలి (JNM)లో పనిచేసింది.2007లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC), ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయి, అక్కడ చైతన్య నాట్య మంచ్ (CNM)లో చేరింది. 2016లో డివిజన్ కమిటీ సభ్యురాలిగా (DVCM) పదోన్నతి పొంది, DKSZC పరిధిలోని CNMలో సాంస్కృతిక ఉప-సమితి సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టింది. 2018లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా (SCM) పదోన్నతి పొందింది.గతంలో ఎన్నో సార్లు కాల్పులు టైంలో వీరిద్దరూ పోలీసులు నుంచి తప్పించుకున్నారుప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా మావోయిస్టు లు జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ మిగిలిన మావోయిస్ట్ లు జనజీవన స్రవంతిలోకి రావాలి అని కోరుకుంటున్నా అన్నారు. లోగిపోయిన వారికి ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు ఇస్తామన్నారు…. వారి పేరు మీద ఉన్న రివార్డ్ లను వారికే ఇస్తాం సంజీవ్ పై 20 లక్షలు రివార్డ్ ఉంది….దీన పై 20 లక్షలు రివార్డ్ ఉంది వారి పేరు పై ఉన్న రివార్డ్ లను తిరిగి వాళ్ళ కే ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.
……………………………………………
