– దివ్యాంగులు, వృద్ధులకు కలెక్టర్ హరిచందన సూచన
– ప్రజావాణికి రాకుండా వెసులుబాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ కలెక్టరేట్ వరకు వచ్చి.. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు, వృద్ధులకు కలెక్టర్ హరిచందన (Collector Harichandhana) దాసరి వెసులుబాటు కల్పించారు. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి రావాల్సిన అవసరం లేకుండానే.. తమ దరఖాస్తులను వాట్సాప్ ద్వారా పంపించవచ్చని సూచించారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమ ఆర్జీల ను ఇప్పటినుంచి సెల్: 7416687878 నంబర్‌కు పంపిస్తే కలెక్టరేట్ సిబ్బంది వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పోర్టల్‌లో నమోదు చేసి ఐడీ కేటాయించి సమాచారం అందిస్తామన్నారు. ప్రతీ వారం గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanthreddy) సూచనల మేరకు ప్రజావాణిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్తగా వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
…………………………………………

మహారాజ రాజా శ్రీ హైద్రాబాద్ కలెక్టర్ గారికి నాయొక్క విన్నపం తెలియజేయడం ఏమనగా
నేను అనగా బండి సూర్యనారాయణ అను నేను సింగనమల మండల్ నివాసిని మానాన్న బండి యర్నగప్ప నంద్యాల ఫారెస్ట్ ఆఫీస్ లో ఫారెస్ట్ రేంజర్ గా ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి నా పేరు మీద చేయించాడు మరియు విశాఖపట్నం డాక్‌యార్డ్ లో చర్మాల Export వ్యాపారం చేస్తుండెను అప్పుడు మాకు చాల ఇన్కమ్ వస్తుందెను అప్పుడు మేము విశాఖపట్నం లో అక్ఖేపాలెం లో ఒక్క ఇల్లు మరియు వాల్తేర్ లో రెండు ఇల్లు మరియు ఉప్పాడ లో ఒక్క ఇల్లు హైదరాబాద్ బంజారాహిల్స్ లో 8 ఇల్లు మరియు జూబ్లీహిల్స్ లో 4 ఇల్లు మా స్వగ్రామం వేంగి లో ఒక్క ఇల్లు మరియు 100 ఎకరాల పొలం యున్నది మరియు కైకలూరు లో ఒక్క ఇల్లు 100 ఎకరాల చింతపండు తోట ఉన్నదీ మరియు సింగనమల లో 75 ఎకరాల పొలం రెండు ఇల్లు యున్నవి
మానాన్న విశాఖపట్నం అసెంబ్లీ కాంస్టుట్యూషన్ కి MLA పోటీచేసి బారి మెజారిటీతో గెలుపొందెను అప్పుడ్డు మానాన్న Central Minister గా పదవిలో యుండెను మరియు మానాన్న సింగనమల అసెంబ్లీ కాన్స్టాంటికి MLA పోటీచేసి గెలుపొందెను మానాన్న కి నోరు తిరగక చేసి యున్నందువలన మానాన్న MLA పదవికి రాజీనామా చేసి యుండెను అప్పుడు మేము ఇన్కమ్ టాక్స్ అధీనం లో యున్నాము మానాన్న హస్తి అంత యు నాపేరు మీద చేయించియున్నాడు నేను డిగ్రీ పట్టభద్రుడైన తరువాత హస్తి కి అనుమతించుధమని మాకు చెప్పి యున్నారు మేము అలాగే అన్నాడు మానాన్న నేను ఇప్పుడు డిగ్రీ పట్టా భద్రుండై నైనను ఇప్పు నాకు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గారు అనుమతించుటకు ఎలాంటి అభ్యన్తరం లేదు కావున నేను హైదరాబాద్ బంజారాహిల్స్ కి వచ్చుటకై అనుమతించుదురని కోరుచున్నాను
కంప్లీనెంట్
బండి సూర్యనారాయణ