* ‘ఓటర్ అధికార్ యాత్ర’ లో ప్రచారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బిహార్ లోని ఫుల్ ఫరాజ్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకాటి శ్రీహరి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాల తర్వాత… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్లో జరుగుతున్న ‘వోటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. బిహార్లో ఓటరు జాబితాల్లో అక్రమాలను ఎండగట్టడానికీ, ఓటు హక్కును కాపాడేందుకు ఈ యాత్రను చేపట్టినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
