* ‘‘ఎక్స్’’ నుంచి వివరాలు రాగానే తదుపరి చర్యలు
* హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అమిత్ షా ఫేక్ వీడియోపై విచారణ వేగవంతం చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోనే ఆ వీడియో రూపొందించినట్లు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతా ‘‘ఎక్స్’’ లో పోస్టు చేసిన వీడియోను సేకరించామన్నారు. మరిన్ని వివరాల కోసం ‘‘ఎక్స్’’కు లేఖ రాశామన్నారు. వివరాలు రాగానే తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఈ కేసులో కాంగ్రెస్ సోషల్మీడియాకు చెందిన ఐదుగురు సభ్యులను ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. ఫేక్ వీడియోకు సంబంధించి ఢిల్లీలో కూడా కేసు నమోదైందన్నారు. కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తమను సంప్రదించినట్లు సీపీ వివరించారు.
——————————-