కోరుకొండ సభలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
* కోరుకొండ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, విజయవాడ : ప్రజలకు పథకాలు అందకుండా ఢిల్లీవాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోరుకొండ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్కాచెల్లెళ్లకు పథకాల సొమ్ము అందకుండా అడ్డుపడ్డారని తెలిపారు. పథకాలను ఆపగలరు కానీ.. విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిన నగదును మొత్తం చెల్లిస్తామని వెల్లడించారు. ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. బ్రేకులు లేవు.. పెడల్ లేదు.. టైర్లు లేవు.. ట్యూబులు లేవు.. అంటూ టీడీపీని విమర్శించారు. మీ ఆశీస్సులు ఉన్నంత వరకూ తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు.
——————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
