
* కేసీఆర్ సైన్యం తప్ప ఎవరూ అండగా ఉండరు
* కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంరు
* మెడలో పుస్తెలతాడు తీసుకోకపోతేచాలు..
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఆయన నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే (MIRYALAGUDA GUNMEN) గన్‌మన్ లారీ యూరియా ఎత్తుకెళ్లారని, గన్‌మన్ లారీ యూరియా ఎత్తుకెళ్తే, ఎమ్మెల్యే ఎంత దోచుకోవాలని అని ప్రశ్నించారు. ఓఆర్ ఆర్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. జిల్లాల్లోని ప్రజలు కాంగ్రెస్ హామీలు చూసి మోసపోయారని అన్నారు. గత ముఖ్యమంత్రులు తెచ్చిన మంచి పథకాలు అన్నింటినీ కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. 23 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో అందరికీ తెలిసిందే అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కొరత వేధిస్తోందని తెలిపారు. కేసీఆర్ పేరుందని కేసీఆర్ కిట్లు కట్ (KCR KITS CUT) చేశారని తెలిపారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు అన్నీ నిలిచిపోయాయని అన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని చెప్పారని, మెడలోని పుస్తెలపాడు ఎత్తుకుపోకపోతే అదే చాలని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసల్లేవని, ఏ పథకాలకు పైసల్లేవని ఎద్దేవా చేశారు. క్రైం రేటు 41 శాతం పెరిగిందని, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని, కింద బొక్కలు పడితే వాటిని పూడ్చేవారు లేరని అన్నారు. సర్కారులో పట్టించుకునే వారు లేరని విమర్శించారు. వీళ్లట జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ (MAGANTI GOPINATH) ఆశయాలను కొనసాగిస్తాం.. ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని చెబుతున్నారని ప్రశ్నించారు. ఈరోజు మీ ఇళ్ల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులందరూ నవంబర్ మాసం తర్వాత ఒక్కడంటే ఒక్కడు ఎడ్రస్ లేకుండా పారిపోతారని అన్నారు. ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారని, చివరకు మిగిలేది ఇదే గులాబీ దండు, గులాబీ కండువా, కేసీఆర్ సైన్యం తప్ప ఎవరూ కనిపించరని తెలిపారు. ప్రజలు ఆలోచించుకుని ఓట్లు వేయాలని కోరారు..
…………………………………….