Lions Club Free Mineral Water
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆఫ్ శివునిపల్లి ఆధ్వర్యంలో “ఎస్సార్ వాటర్ ప్లాంట్” యజమాని పులి వినయ్ సహకారంతో శాశ్వత ప్రాజెక్టు కింద ప్రతిరోజు ఉచిత మినరల్ వాటర్ అందించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తుమ్మనపల్లి రవి కిరణ్, కార్యదర్శి పులి వినయ్ కుమార్, కోశాధికారి కందగట్ల శ్రీకాంత్, గౌరీశెట్టి అనిల్, రవీందర్, ప్రధానోపాధ్యాయులు సంపత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన లైన్స్ క్లబ్ ఆఫ్ శివుని పల్లి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు. నిన్న రాత్రి జరిగిన ఇన్స్టాలేషన్ కార్యక్రమం తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తోడ్పాటు అందించిన లైన్స్ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
