High Court Judge Surepalli Nanda Inaugurates Legal Cell at Station Ghanpur Court
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
కోర్టులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయ పరిష్కారం చూపాలని హైకోర్టు జడ్జ్ సూరపల్లి నంద అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని కోర్టుకు మంజూరైన మండల లీగల్ సెల్, ఈ సేవ కేంద్రంను శనివారం ఆమె ప్రారంభించారు.
అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు, కక్షిదారులకు మండల లీగల్సేల్ ద్వారా ఎన్నో కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. కక్షిదారులకు ఇబ్బంది కాకుండా కేసు అప్డేట్స్ ఆన్లైన్లో చూసుకునే ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆమె తెలిపారు.
యువ అడ్వకేట్స్ అధికంగా ఉన్న ఈ కోర్టు పరిధిలోని కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేకూర్చాలని ఆమె న్యాయవాదులను కోరారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్జి ప్రతిమ, స్థానిక జడ్జి శివ లీల, సందీప, శశి, శ్రీదేవి బార్ కౌన్సిల్ సభ్యులు ముందసాని సహోదర రెడ్డి, హనుమకొండ అధ్యక్షులు సొల్లేటి రామకృష్ణ, వరంగల్ అధ్యక్షులు చకిలం ఉపేందర్, జనగామ జనరల్ సెక్రెటరీ మన్నే సత్యం, కొప్పుల సందీప, బార్ కౌన్సిల్ మెంబెర్ మునగాల రవీందర్, ఉపాధ్యక్షుడు సోలో మోన్ రాజ్, శర్మ కుమారి, గుర్రపు బాబు, శ్రీనివాస్, మారపాక ప్రలక్ష్మణ్, పనికర శ్రీశైలం, తాడూరు వనిత, అనూష, విజయ భాస్కరరావు, తాడం శ్వేత, తాళ్ల పెళ్లి ప్రేమ్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
