Spoken English Books Distribution
* మల్లం పల్లి పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాల పంపిణీ..
ఆకేరు న్యూస్, పాలకుర్తి : జనగాం జిల్లా పాలకుర్తి మండలం లోని మల్లం పల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు వెంకట దాసు, మోహినుద్దీన్, రవి కిషోర్, కెబి వెంకటరమణ, సైంటిస్ట్ కర్రె మల్లేష్, రషీద్, జేఎంఐ సంస్థ ప్రతినిధులు గ్రామ సర్పంచ్ పోశాల వెంకన్నతో కలిసి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను పంపిణీ చేశారు.
* ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి ఆంగ్ల భాషా నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామీణ, పేద నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ సంభాషణలో భయం వీడి, స్పష్టంగా మాట్లాడటానికి ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు.
* మహనీయుల ఆశయ సాధనకు కృషి..
పుస్తకాల పంపిణీ అనంతరం ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సామాజిక సమానత్వం, నిరుపేదల విద్య కోసం తమ జీవితాలను ధారపోసిన మహనీయుల అడుగుజాడల్లో నడవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా ప్రొఫెసర్లు ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
