ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని సూచిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారంటే..
– జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. భార్య అన్నా లెజ్నెవాతో కలిసి వచ్చి మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
– ఏపీ సీఎం జగన్.. పులివెందులలోని భాకరాపూరంలో ఓటు వేశారు. సతీమణి భారతితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన జగన్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం..సిరా గుర్తును చూపిస్తూ.. అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.
– గుంటూరు జిల్లా ఉండవల్లిలో మాజీ సీఎం చంద్రబాబు దంపతులు ఓటేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నారా లోకేష్, బ్రాహ్మణి కూడా ఉండవల్లిలోనే ఓటేశారు.
– హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ పోలింగ్ బూత్ వైసీపీ ఎంపీ షర్మిల దంపతులు ఓటు వేశారు.
– కృష్ణా జిల్లా గుడివాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్, జస్టిస్‌తో పాటు ఓటేసిన ఆయన సతీమణి, కుమార్తె
– అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓటేసిన అయ్యన్న పాత్రుడు.