Neemrana Road Accident in Rajasthan
* తల్లి.. ఇద్దరు చిన్నారులు స్పాట్లో మృతి
* మృత్యు లారీకి ముగ్గురు బలి..!
ఆకేరు న్యూస్, రాజస్థాన్ : రాజస్థాన్‌లోని ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న తల్లి, ఇద్దరు చిన్నారులను వేగంగా వచ్చిన భారీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
* నీమ్రాణాలో విషాదం..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌లోని నీమ్రాణా (Neemrana Road Accident ) ప్రాంతం హీరో చౌక్ సమీపంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. దుఘేడా గ్రామానికి చెందిన కవితా దేవి (25) తన ఇద్దరు చిన్నారులు కార్తీక్, భీమ్‌లతో కలిసి పని నిమిత్తం నీమ్రాణాకు (Neemrana Road Accident) వచ్చారు. ఈ క్రమంలో పిల్లలతో కలిసి ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారి (NH-48) దాటుతుండగా వేగంగా వచ్చిన భారీ లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు.
* హైవేపై నిలిచిపోయిన ట్రాఫిక్..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న నీమ్రాణా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
* పరారీలో లారీ డ్రైవర్ కోసం గాలింపు..
ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో దుఘేడా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : బిస్లరీ వాటర్ వివాదం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

