* మావోయిస్టులు ఆయుధాలు వీడి జనసవ్రంతిలోకి రావాలి
* బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజీపీగా తన తొలి చాలెంజ్ స్థానిక ఎన్నికలను విజయవంతంగా జరిగేలా చూడడం అన్నారు. ఇందుకు పకడ్బందీ చర్యలు చేపడతానని తెలిపారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని చెప్పారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని.. ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమకు రెడ్ బుక్.. పింక్ బుక్ ఉండవు..మాదంతా ఖాకీ బుక్ అన్నారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు.
ఆయుధాలు వీడాలి
మావోయిస్టులు (maoist) ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రకటన రిలీజ్ చేశారని, బయటకు రావడానికి, ఆయుధాలు వదిలి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారన్నారు. జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నపుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారని చెప్పారు. వేణుగోపాల్ ఇచిన స్టేట్మెంట్ జగన్ ఖండించారని.. ప్రజా పోరాట పంథా సక్సెస్ అవల్లేదని మావోయిస్టులే అంటున్నారని డీజీపీ వెల్లడించారు. చాలా మంది ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వస్తున్నారని.. రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ కవితక్క కూడా లొంగిపోయారన్నారు. మావోయిస్టులతో తమకు ఇక్కడ సమస్య లేనప్పుడు వాళ్ళతో చర్చలు అనవసరమని చెప్పారు. సమాజాభివృద్దిలో భాగం కావాలని నక్సల్స్ ను కోరుతున్నామన్నారు.
సోషల్మీడియాలో పోస్టులతో జాగ్రత్త
సామాజిక మీడియా(SOCIAL MEDIA) లో వార్తలు పోస్టు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని డీజీపీ హెచ్చరించారు. నకిలీ వార్తల ప్రచారం, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కటిన చర్యలు తప్పవన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. బేసిక్ పోలీసింగ్, విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని అన్నారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
