El Nino Farming Advisory
* బోర్వెల్స్, బావుల కింద వరి సాగు తగ్గించాలి
– ఏ ఓ వీరభద్రం
* ఎల్ నినోపై మహిళా సమైక్య సంఘాలకు అవగాహన సదస్సు
ఆకేరు న్యూస్, రాయపర్తి:
బోర్వెల్స్ మరియు బావుల కింద నీటి వాడకం ఎక్కువగా ఉండే వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో ఎక్కువ లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని,పిలుపునిచ్చారు.
స్థానిక శ్రీశక్తి భవన్ ప్రాంగణంలో మహిళా సమైక్య సంఘాల (SERP/IKP) ప్రతినిధులకు “ఎల్నీనో ప్రభావం – వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.
* ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం మాట్లాడుతూ..
ఎల్నీనో ప్రభావం: రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం కారణంగా ఆగస్టు 20 వ తారీకు వరకు వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నాయని, దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నీటి పొదుపు – ప్రత్యామ్నాయ పంటలు: నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వరి స్థానంలో ఆరుతడి పంటలైన ఆముదం, పెసర, మినుము, కందులు, నువ్వులు మరియు చిరుధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు) సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని సూచించారు.
* మహిళా సంఘాల పాత్ర కీలకం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా రైతాంగానికి త్వరితగతిన సమాచారం చేరుతుందని, ప్రతి ఇంటికి, రైతు కుటుంబానికి ఈ సందేశాన్ని తీసుకెళ్లడంలో మహిళా సమైక్య సభ్యులు చొరవ చూపాలని కోరారు.
బిందు, స్ప్రింక్లర్ సేద్యం: పంటలకు నీటి యాజమాన్య పద్ధతులు, బిందు (Drip) మరియు స్ప్రింక్లర్ సేద్యం వాడకంపై రైతులను చైతన్యపరచాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఐకేపీ (IKP) సిబ్బంది, మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు (AEOలు) మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు, వివోఏ (VOA)లు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
