Narsampet Political Protest Clash
* నర్సంపేటలో పొలిటికల్ రచ్చ
* కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య రణరంగం
* రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ ధర్నా
* దేశ భద్రత పేరుతో బీజేపీ కౌంటర్ నిరసన
* ముహూర్తాల వేళ రోడ్లపైనే నిలిచిపోయిన పెళ్లి బృందాలు
ఆకేరు న్యూస్, నర్సంపేట: పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు అమరవీరుల స్థూపం వద్ద ధర్నాకు దిగగా దేశ భద్రతను దెబ్బతీసే చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు కూడా కౌంటర్ నిరసన చేపట్టారు.
ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు.
ఇదే సమయంలో వివాహ ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లకు వెళ్లే పెళ్లి బృందాలు వాహనాలు గంటల తరబడి భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
