NEET Bandh Support Telangana
* తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో మద్దతు, విద్యా సంస్థల బంద్కు సంపూర్ణ సంఘీభావం
ఆకేరు న్యూస్, తొర్రుర్ :
నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న CJP, వివిధ విద్యార్థి మరియు ప్రజా సంఘాల నాయకులపై పోలీసులు జరిపిన దాష్టీకాన్ని, అమానుష లాఠీఛార్జీని తెలంగాణ కార్మిక సమైక్య తీవ్రంగా ఖండిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా, న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులు, ప్రజా సంఘాలపై పోలీసులచే అణచివేత చర్యలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏల్పుల వెంకట సాయిలు పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల అరాచకానికి నిరసనగా, నీట్ లీకేజీపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా తెలంగాణ కార్మిక తొర్రుర్ మండల కమిటీ సమైక్య సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది.
* ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏర్పుల వెంకట సాయిలు మాట్లాడుతూ
”లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును నీట్ పేపర్ లీకేజీలతో బలితీసుకుంటున్నారు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, పోలీసులతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. ఈ విద్యా సంస్థల బంద్ న్యాయబద్ధమైనది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు, ప్రజా సంఘాలకు తెలంగాణ కార్మిక సమైక్య ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.”
* ముఖ్య డిమాండ్లు
ఢిల్లీలో విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిచే సమగ్ర విచారణ జరిపించాలి.
బాధిత విద్యార్థులందరికీ తక్షణమే న్యాయం చేయాలని పేర్కొన్నారు
