పోలీస్స్టేషన్ లోనే గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
* పిస్టల్ తో కాల్చుకుని మృతి
ఆకేరు న్యూస్, నంద్యాల : నంద్యాల జిల్లాలో ఓ కానిస్టేబుల్ పోలీస్స్టేషన్ లోనే గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ శంకర్ రెడ్డి ఇటీవలే నంద్యాలకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. బుధవారం రాత్రి సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు. తెల్లవారుజామున స్టేషన్లోని బాత్రుమ్లో గన్తో తలపై కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ మృతిపై సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ విచారణకు ఆదేశించారు. సీఐ ప్రసాద్ రావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
