* జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఆకేరు న్యూస్, వరంగల్ :తెలంగాణాకే గర్వకారణంగా కాకతీయు సంస్కృతి, కళా సంపద నిలుస్తున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చెప్పారు. పట్టణంలోని జిల్లా పురావస్తు పరిశోధన, ప్రదర్శనశాలను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లడారు. ఈ ప్రాంత వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని తెలిపారు. జిల్లా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పడుతున్న సంరక్షణా పనుల గురించి ఎంపీ ఆరా తీశారు. పురాతన శిల్పకళ, కాకతీయ శిలా శాసనాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయని, వీటి సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. జిల్లా పురావస్తు అధికారులు ఎంపీకి వివిధ శిల్ప సంపద, ప్రాచీన నాణేలు, శాసనాల చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అక్కడ ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఎంపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి, సిబ్బంది పాల్గొన్నారు.
