* నైతిక విజయం నాదే..
* అప్రజాస్వామికంగా ఉప ఎన్నిక..
* ఫలితాలపై మాగంటి సునీత సంచలన వ్యాఖ్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఉప ఎన్నిక ఫలితంపై ఆమె మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని ఆవేదన చెందారు. ప్రతిచోటా రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్‌ది గెలుపే కాదని.. నైతిక విజయం తనదేనని స్పష్టం చేశారు. ఓటర్లను కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురి చేశారన్నారు. ఒక మహిళపై అంతమంది రౌడీయిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు. నేను ఏం మాట్లాడినా.. కార్యకర్తలను పరామర్శించినా తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రజలను కాంగ్రెస్ భయబ్రాంతులకు గురిచేసిందని తెలిపారు. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటో ప్రజలు గమనించారని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
