* బెంగళూరు రేవ్ పార్టీలో కలకలం
* 87 మందికి డ్రగ్స్ పాజిటివ్
* అందులో తెలుగువారు కూడా..
ఆకేరున్యూస్, హైదరాబాద్ : బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ 98 మంది నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఏకంగా 87 మందికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు.
బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోని ఫామ్‌హౌస్‌పై..కొద్ది రోజుల క్రితం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. క్రైమ్ బ్రాంచ్ చేసిన తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లుతో పాటు కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీకి బెంగళూరుకి చెందినవారితో పాటు ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి సెలబ్రెటీలు పైగా హాజరవగా..ఇందులో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు 98 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా, 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో నటి హేమ, మరోనటి అషీరాయ్, పార్టీ ఇచ్చిన వాసుకు పాజిటివ్‌గా తేలింది. హేమ స్నేహితుడు చిరంజీవి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కృష్ణవేణి పేరుతో పార్టీకి..
ఈకేసులో నటి హేమ మొదటి నుంచి పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చింది. ఓ ఫేక్ వీడియో రూపొందించి ఆ పార్టీకి తాను హాజరుకాలేదని చెప్పడం కలకలం రేపింది. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. పార్టీకి ఆమె కృష్ణవేణి పేరుతో హాజరైనట్లు తెలుస్తోంది. కాగా, పాజిటివ్ రావడంపై హేమ స్పందించారు. ఏం చేస్తారో చేసుకోండని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని మీడియాతో తెలిపారు.
—————-