బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి దారుణ హత్య
* ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో నరికి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ బీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు. ఆరుబయట నిద్రిస్తున్న అతడిపై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత రాత్రి ఆరుబయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శ్రీధర్ రెడ్డిపై గొడ్డలితో వేటు వేశారు. తల నరికి చంపేశారు. శ్రీధర్‌రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. రాజకీయ కక్ష్యతోనే శ్రీధర్‌రెడ్డిని హత్య చేశారని ఆయన ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
