ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు వెంకటాపురం, కన్నాయి గూడెం, వాజేడు మూడు మండలాల్లో బుధవారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 53918 మంది ఓటర్లకు గాను 44513 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొవడంతో 82.56% పోలింగ్ నమోదయింది. వెంకటాపురం 25336 ఓటర్ల కు గాను 20,539 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. కన్నాయిగూడెం మండలంలో 9151కి గాను 75 76 పోలింగ్ 82.79 శాతం జరిగింది.వాజేడు మండలంలో 19431 కి గాను 16,398 మంది ఓట్లు వేశారు. మూడో విడత ఎన్నికలు సరళిని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ పరిశీలించారు. ఆయన మూడో విడత ఎన్నికల కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాజేడు, జగన్నాధపురం, వెంకటాపురం, తదితర మండలాల్లో పర్యటించారు. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏది ఏమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.

………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
