* 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ
* ధాన్యం బోనస్ గా రూ.1,780 కోట్లు అందించాం
* ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
* గవర్నర్ విష్ణుదేవ్ వర్మ
* సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన తర్వాత రాష్ట్రం గీతాలాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్, డీజీపీ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు వివరించారు. సన్నవడ్లపై క్వింటాల్ కు రూ.500చొప్పున బోనస్ చెల్లిస్తామన్నారు. ధాన్యానికి బోనస్ గా రైతులకు 1780 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యం ఉత్తత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందని తెలిపారు. భూవివాదాలు పరిష్కరించేలా భూభారతి చట్టం తెచ్చామని అన్నారు. గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలు భర్తీని పూర్తి చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు 62 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వివరించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ రికార్డ్స్ లో చోటు దక్కిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇటీవలే తెలంగాణ డాక్యుమెంట్ ఆవిష్కరించిందన్నారు. రైజింగ్ తెలంగాణ – 2047 సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు. మూడు కీలక రంగాలకు మూడు జోన్లు ఏర్పాటు చేస్తోందన్నారు. ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మేడారం అభివృద్ధి కోసం రూ.251 కోట్లు కేటాయించామన్నారు. రైతులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు.
…………………………………………………..
