ఆకేరు న్యూస్ , డెస్క్:భారత క్రికెట్ చరిత్రలో ఒక శకాన్ని లిఖించిన ప్రముఖ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం రోజున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.ఐఎస్ బింద్రా కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మహా వ్యక్తి అని ,1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసి, బోర్డును ఆర్థికంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) అధ్యక్షుడిగా 1978 నుండి 2014 వరకు సుమారు 36 ఏళ్ల పాటు విశేషమైన సేవలందించారు.ఐసీసీ (ICC) ప్రధాన సలహాదారుగా పనిచేస్తూ అంతర్జాతీయ క్రికెట్ నిర్ణయాల్లో తనదైన ముద్ర వేశారు.క్రికెట్ ప్రపంచకప్‌ను తొలిసారిగా ఇంగ్లాండ్ గడ్డ దాటించి, భారత్-పాకిస్థాన్లలో (1987) నిర్వహించడంలో బింద్రా కృషి కీలకమైనది. ఆసియా ఖండంలో క్రికెట్ వ్యాప్తికి ఆయన వేసిన పునాదులే నేడు భారత్ క్రికెట్ సూపర్ పవర్‌గా ఎదగడానికి ప్రధాన కారణం.మొహాలీలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఆయనదే ప్రధాన పాత్ర. ఆయన సేవలను గుర్తించిన పీసీఏ, 2015లో మొహాలీ స్టేడియానికి *”ఐఎస్ బింద్రా స్టేడియం”*గా పేరు మార్చింది.బింద్రా మృతికి ఐసీసీ ఛైర్మన్ జై షా సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. “భారత క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో బింద్రాది చెరగని ముద్ర. ఆయన వారసత్వం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు. బీసీసీఐ మరియు పలువురు మాజీ క్రికెటర్లు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
