ఆకేరు న్యూస్, హైదరాబాద్ : త్వరపడండి.. రూ.26 వేలకే కారు.. బంపర్ ఆఫర్.. ఆలస్యం చేస్తే మీరు కారుకు ఓనర్ అయ్యే అవకాశం కోల్పోయినట్లే.. అని ఇన్స్టాలో ఓ వ్యాపారి పోస్టు పెట్టాడు. ఇప్పుడు అదే ఆ వ్యాపారి అరెస్టుకు కారణమైంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి 26 వేల రూపాలయకే కారు అంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో ఈరోజు తెల్లవారుజామునే ఆ వ్యాపారి దుకాణానికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో జనం రావడంతో రోషన్ కార్లు లేవని చెప్పాడు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ప్రజలు అక్కడున్న కార్లపై రాళ్ల దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కారు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. అతడిని నాచారం పోలీస్ స్టేషన్ కు పంపించారు.
………………………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
