కొరివి చిత్రబృందం
* విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ థ్రిల్లర్
* టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన చిత్రబృందం
ఆకేరు న్యూస్, సినిమా: ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ గాదె తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘కొరివి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు శ్రీధర్ గాదె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
భారీ తారాగణం
శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఆది సాయి కుమార్‌తో ‘చుట్టాలబ్బాయ్’, ఆనంద్ దేవరకొండతో ‘హైవే’ వంటి చిత్రాలను నిర్మించిన ఆయనకు ఇది ప్రొడక్షన్ నంబర్ 3. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. నందు మురళీధర్, లిఖిత కథానాయికలుగా కనిపించనున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిధి చుట్టూ దెయ్యం కథ
మాయా నది ప్రాంతంలో ఉన్న ఓ నిధికి కాపలాగా ఉండే కొరివి దెయ్యం చుట్టూ ఈ సినిమా కథ సాగనున్నట్లు టైటిల్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ హారర్ కథను దర్శకుడు శ్రీధర్ గాదె సరికొత్త కథాకథనాలతో తెరకెక్కిస్తున్నారు. గ్లింప్స్‌లో చూపించిన మేకింగ్ విజువల్స్, హారర్ అంశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
శరవేగంగా షూటింగ్
ప్రస్తుతం ‘కొరివి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య తదితరులు నటిస్తున్నారు. టైటిల్ ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

