ఆకేరు న్యూస్, ములుగు: ప్రతి రెండేళ్లకు వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసీ కోయ ఇలవేల్పుల సమ్మేళనం ఐటిడిఏ ఏటూరునాగారం ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సమ్మేళనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్,ఒడిస్సా తదితర ప్రాంతాల నుండి 47 ఇలవేల్పులకు 1460 మంది వచ్చారు. తల పతులు, ఒడ్డెలు, వేల్పులకు 50 మంది పాల్గొన్నారు. నవయుగం లో ఆదివాసీ సంప్రదాయాలను నేటి యువత పట్టించుకోకపోవడం వల్ల సంప్రదాయాలు కనుమరుగు అవుతున్న క్రమంలో ఇలాంటివి చేయడం మంచి శుభపరిణామం అన్నారు. ఇంటి పేరుకో ఇలవేల్పు దేవరలు ఉండడం ప్రపంచంలో గొప్ప సంస్కృతి ఆదివాసీలకు ఉందన్నారు. ఆదివాసీ ఇలవేల్పు పండుగలను గొలుసుకట్టు జాతరలుగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం క్యూరేటర్ కుర్సం రవి కుమార్, తలపతుల సంఘం జాతీయ అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహన అధ్యక్షులు కుర్సం నాగేశ్వరావు, రాష్ట్ర అధ్యక్షులు యాప లక్ష్మణ్ రావు, జిల్లా అధ్యక్షులు చెల నాగేంద్ర ప్రసాద్, బుగ్గ కోటేశ్వేర్రావు, కాక నర్సింగరావు, వజ్జ నర్సింగరావు, తో పాటు 1460 మంది ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
