ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను శని వారం ప్రభుత్వ ప్రముఖ అధికారులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఆదివాసిల ఆచార సంప్రదాయాల ప్రకారం పసుపు కుంకుమ బంగారం బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మహిళ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అనితా రామచంద్రన్, స్థానిక కలెక్టర్ దివాకర దంపతులు అదనపు కలెక్టర్ మహెందర్ జీ, హైకోర్టు జడ్జిలు విజయసేనారెడ్డి, సృజన, రాణి, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చిత్రా మిశ్రా, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు ప్రవిణ్, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మినారాయణ, తదితరులు గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొదట నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఎండోమెంట్ శాఖ అధికారులు పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.

…………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
